Share News

మన్యం విప్లవ వీరుడు అల్లూరికి ఘననివాళులు

ABN , Publish Date - May 08 , 2025 | 01:17 AM

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు బుధవారం స్థానిక అల్లూరి పార్కులో ఆయనతోపాటు గాం గంటం దొర సమాధులు, అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మన్యం విప్లవ వీరుడు అల్లూరికి ఘననివాళులు

కృష్ణాదేవిపేట, మే 7 (ఆంధ్రజ్యోతి):

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు బుధవారం స్థానిక అల్లూరి పార్కులో ఆయనతోపాటు గాం గంటం దొర సమాధులు, అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అల్లూరి జీవిత చరిత్ర నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రిటైర్డ్‌ అదనపు ఎస్పీ కరణం సత్యనారాయణ అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా జూలై నాలుగో తేదీలోగా పార్కులో తెలుగు, ఇంగ్లిష్‌లో 50 చిత్రపటాలతో అల్లూరి జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, అల్లూరి జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, జాతీయ అల్లూరి యువజన సంఘం రాష్ట్రకార్యదర్శి పల్లా భాస్కరమణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 01:17 AM