Share News

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:15 PM

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వాస్తవానికి సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29న నామినేషన్ల స్వీకరణ, 30న నామినేషన్ల ఉపసంహరణ, జనవరి 4న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాసాడ ఈశ్వరరావు, ముఖి శేషాద్రి

అధ్యక్షునిగా ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శేషాద్రి

పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వాస్తవానికి సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29న నామినేషన్ల స్వీకరణ, 30న నామినేషన్ల ఉపసంహరణ, జనవరి 4న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క ప్యానెల్‌ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో సదరు ప్యానెల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల ప్రధానాధికారి పలాసి కృష్ణారావు ప్రకటించారు.

నూతన కమిటీ కార్యవర్గం ఇదే...

గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా మాసాడ ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ముఖి శేషాద్రి, మహిళా కార్యదర్శిగా శెట్టి శాంతకుమారి, కోశాధికారిగా వి.కొండలరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా మినుముల ప్రసాదరావు, ఉపాధ్యక్షులుగా ఎస్‌.గురుదొర, ఆర్‌.అనిల్‌కుమార్‌, చెండా బాలకృష్ణ, కురుసా శివప్రసాద్‌, సంయుక్త కార్యదర్శిగా పాంగి నందో, కూడ ఈశ్వరరావు, పలాసి తిరుపతిరావు, సీహెచ్‌.సతీశ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులుగా పి.ఆనందరావు, కె.అమర్‌నాధ్‌, కె.రమేశ్‌, బి.రామచంద్రరాజు, ఎన్‌.మహేశ్‌, ఆర్‌.కమలకుమారి, పి.లింగన్న, కె.స్వామినాధమ్‌, కె.మల్లేశ్వరరావు, జి.సింహాచలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజన ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:15 PM