Share News

జాతీయ రహదారిపై కూలిన చెట్టు

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:13 AM

జాతీయ రహదారిపై కూలిన చెట్టు

జాతీయ రహదారిపై కూలిన చెట్టు
రహదారిపై పడిన చెట్టును పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

గంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం

రంగంలోకి దిగి తొలగించిన రూరల్‌ పోలీసులు

కొత్తూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి మండలం కొప్పాక వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం పెద్ద చెట్టు కూలిపోయింది. సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గంటపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రూరల్‌ పోలీసు స్టేషన్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ జి.రవికుమార్‌ రంగంలోకి దిగి చెట్టు తొలగింపునకు చర్యలు చేపట్టారు. సుమారు గంట తరువాత వాహనాలు యథావిధిగా నడిచాయి.

Updated Date - Sep 06 , 2025 | 01:13 AM