లారీల్లో రా మెటీరియల్ తరలింపు
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:23 AM
విశాఖ స్టీల్‌ప్లాంటులో రా మెటీరీయల్‌ను లారీలో తరలిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రైల్వే వ్యాగన్లు, గంగవరం పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆర్‌ఎంహెచ్‌పీ (రా మెటీరీయల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) విభాగానికి చేరుతుంది.
ఉక్కు అధికారుల వింత పోకడ
ఉక్కుటౌన్‌షిప్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంటులో రా మెటీరీయల్‌ను లారీలో తరలిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రైల్వే వ్యాగన్లు, గంగవరం పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆర్‌ఎంహెచ్‌పీ (రా మెటీరీయల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) విభాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆయా విభాగాలకు కన్వేయర్ బెల్టు ద్వారానే పంపుతారు. ఇటీవల కన్వేయర్‌లు సరిగా పనిచేయకపోవడంతో ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం నుంచి మెటీరియల్‌ను లారీల్లో తరలిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం భారీ లారీలను వినియోగిస్తున్నారని, ఆయా మార్గాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. లారీల్లో రా మెటీరియల్ తరలింపు భారీ ఖర్చుతో కూడుకున్నదని, సమయానికి కూడా అందదని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.