Share News

రెవెన్యూలో బదిలీలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:13 AM

జిల్లాలో నలుగురు డిప్యూటీ తహశీల్దార్లను కలెక్టర్‌ బదిలీ చేశారు. ఇటీవల సీనియర్‌ డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి ఇచ్చారు. దీంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి నలుగురు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.

రెవెన్యూలో బదిలీలు

నలుగురు డిప్యూటీ తహశీల్దార్లకు స్థానచలనం

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో నలుగురు డిప్యూటీ తహశీల్దార్లను కలెక్టర్‌ బదిలీ చేశారు. ఇటీవల సీనియర్‌ డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి ఇచ్చారు. దీంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి నలుగురు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. పెదగంట్యాడ డిప్యూటీ తహశీల్దారు బీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ను భీమిలి మండలానికి, స్టీల్‌ప్లాంటు భూసేకరణ విభాగంలో ఉన్న ఎన్‌.రవికాంత్‌ను గాజువాకకు, పెందుర్తిలో పనిచేస్తున్న ఎ.సంతోషకిరణ్‌ను విశాఖ ఉక్కు భూ సేకరణ విభాగానికి, జాతీయ రహదారుల విభాగంలో పనిచేస్తున్న జి.కిషోర్‌ను పెందుర్తి మండల డీటీగా బదిలీ చేశారు.

వీఆర్వోలకు డిప్యూటేషన్‌

అలాగే వీఆర్వోల బదిలీలు కూడా అయ్యాయి. ఆనందపురం మండలం కుసులవాడ వీఆర్వోను పెందుర్తి మండలం చింతగట్లకు, పద్మనాభం మండలం పొట్నూరు వీఆర్వో బి.రమేష్‌నాయుడిని చినముషిడివాడకు డిప్యూటేషన్‌ వేశారు. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వీఆర్వోలు పెందుర్తి మండల తహశీల్దారు కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఎస్‌.ఆర్‌.పురం నుంచి రమేష్‌నాయుడును పద్మనాభం మండలానికి బదిలీ చేయగా కొద్దిరోజుల్లోనే తిరిగి పెందుర్తి మండలానికి డిప్యూటేషన్‌పై రావడం గమనార్హ్హం. చింతగట్లలో కొండపొరంబోకు భూమి సుమారు ఐదెకరాలను ప్రైవేటు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు ప్రస్తుత వీఆర్వో అంగీకరించలేదు. దీంతో అఽధికారపార్టీకి చెందిన నేత ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి ప్రస్తుత వీఆర్వోను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jul 31 , 2025 | 01:13 AM