రైళ్లు ఫుల్
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:11 AM
దసరా సమయంలో బెంగళూరు, హౌరా రైళ్లలో బెర్తులు లభించని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-బెంగళూరు, భువనేశ్వర్-బెంగళూరు రైళ్లలో బెర్తులు అక్టోబరు 15వ తేదీ వరకూ అయిపోయాయి. సికింద్రాబాద్, చెన్నై వెళ్లే రైళ్లకు మాత్రం ప్రస్తుతానికి సాధారణ రద్దీ ఉంది.
‘దసరా’కు ముందే రిజర్వు
బెంగళూరు, హౌరా మార్గాల్లో భారీగా డిమాండ్
కొన్నింటిలో అక్టోబరు నెలాఖరు వరకూ బెర్తులు లభించని పరిస్థితి
బెంగళూరు, చెన్నై రైళ్లకు అక్టోబరు 15 వరకూ రద్దీ
సికింద్రాబాద్ రైళ్లకు సాధారణం
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
దసరా సమయంలో బెంగళూరు, హౌరా రైళ్లలో బెర్తులు లభించని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-బెంగళూరు, భువనేశ్వర్-బెంగళూరు రైళ్లలో బెర్తులు అక్టోబరు 15వ తేదీ వరకూ అయిపోయాయి. సికింద్రాబాద్, చెన్నై వెళ్లే రైళ్లకు మాత్రం ప్రస్తుతానికి సాధారణ రద్దీ ఉంది.
హౌరా రైళ్లు ఫుల్
విశాఖ మీదుగా హౌరా వెళ్లే దాదాపు అన్ని రైళ్లలో అక్టోబరు నెలాఖరు వరకు బెర్తులు అయిపోయాయి. కోరమాండల్ (12842), యశ్వంత్‌పూర్-హౌరా (12864), ఈస్ట్‌కోస్ట్ (18046), మెయిల్ (12840), ఫలక్‌నుమా (12704), బెంగళూరు-హౌరా దురంతో (12246) వంటి రెగ్యులర్ రైళ్లకు నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. షాలిమార్ (22641), మైసూరు-హౌరా (22818), వాస్కోడిగామ-షాలిమార్ (18048), గురుదేవ్ (12638), వివేక్ (22503), చెన్నై-సంత్రాగచ్చి (22808), పాండిచ్చేరి-హౌరా (12868), బెంగళూరు-గువాహటి (12509), చెన్నై సెంట్రల్-షాలిమార్ (22826), తిరుచిరాపల్లి-హౌరా (12664), కన్యాకుమారి-హౌరా (12666), తిరుపతి-హౌరా హంసఫర్ (29890), సికింద్రాబాద్-షాలిమార్ (22850), శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832) వంటి పలు వారాంతపు రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. కోరమండల్, మెయిల్, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు, కొన్ని వారాంతపు రైళ్లతోపాటు దువ్వాడ మీదుగా నడిచే రైళ్లల్లో కొన్ని తేదీల్లో ఏసీ కోచ్‌లలో బెర్తులు లభించే పరిస్థితి ఉంది.
బెంగళూరు రైళ్లకు డిమాండ్
విశాఖ మీదుగా బెంగళూరు వెళ్లే రైళ్లలో అక్టోబరు 15 వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి. ముఖ్యంగా భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463), హౌరా-యశ్వంతపూర్ (12863) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్ని క్లాసులకు బెర్తులు నిండిపోయాయి. జసితిహ్ జంక్షన్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22306), భువనేశ్వర్-బెంగళూరు హంసఫర్ (22833), గువాహటి-బెంగళూరు (12510), భగల్‌పూర్-బెంగళూరు (12254), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్-బెంగళూరు హంసఫర్ (22833), హౌరా-మైసూరు ఎక్స్‌ప్రెస్ (22817), న్యూ టిన్సుకియా-బెంగళూరు (22502), కామాఖ్య-బెంగళూరు (12552), పూరి-బెంగళూరు గరీబ్‌రఽథ్ (22883), హౌరా-బెంగళూరు దురంతో (12245), అగర్తలా-బెంగళూరు హంసఫర్ (12504) ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండే టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18111)లో కూడా అక్టోబరు 31 వరకు బెర్తులు ఫుల్ అయిపోయాయి.
చెన్నై మార్గంలో..
చెన్నై వెళ్లే మెయిల్ (12839), బొకారో (13351), టాటా-ఎర్నాకులం (18189) వంటి రెగ్యులర్ రైళ్లలో అక్టోబరు 16 వరకూ బెర్తులు నిండిపోయాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841)లో అక్టోబరు 18 వరకు బెర్తులు నిండినా, కొన్ని తేదీల్లో ఏసీ బెర్తులు లభించే పరిస్థితి ఉంది. భువనేశ్వర్-పాండిచ్చేరి (12898), షాలిమార్-త్రివేండ్రం (22642), గువాహటి-బెంగళూరు (12510), హౌరా-తిరుచిరాపల్లి ((12660), ముజఫర్‌పూర్-యశ్వంతపూర్ (15228), సంత్రాగచ్చి-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ (22807), న్యూజలపాయ్‌గురి-మద్రాసు (22616) వంటి వీక్లీ, బై వీక్లీ రైళ్లకు డిమాండ్ నెలకొంది. విశాఖ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు (22801) అక్టోబరు 17 వరకు బెర్తులు ఫుల్ అయిపోయాయి.
సికింద్రాబాద్ రైళ్లకు అందుబాటులో బెర్తులు
సికింద్రాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), గరీబ్‌రథ్ (12739), కోణార్క్ (11020), ఫలక్‌నుమా (12703), వందేభారత్ (20833), విశాఖ-నాందేడ్ (20811), ఎల్‌టీటీ (18519), దురంతో (22203) వంటి ప్రధాన రైళ్లకు దసరా రద్దీ అంతగా కనిపించలేదు. దాదాపు అన్ని రైళ్లకు బెర్తులు లభించే పరిస్థితి ఉంది. గోదావరి, గరీబ్‌రఽథ్, మహబూబ్‌నగర్ , వందేభారత్, జన్మభూమి వంటి రైళ్లకు ఈ నెల 18 నుంచి ఖాళీలు ఉన్నాయి.