గౌరీపట్నం రూట్లో ట్రాఫిక్ కష్టాలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:43 AM
భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై కాజ్‌వేను ఇంకా పునరుద్ధరించకపోవడంతో మండలంలోని గౌరీపట్నం మార్గంలో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి.
ఇరుకు రహదారి కావడంతో ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతున్న వాహనాలు
విజయరామరాజుపేట కాజ్‌వే పునరుద్ధరణ అయ్యే వరకు తప్పని ఇక్కట్లు
చోడవరం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై కాజ్‌వేను ఇంకా పునరుద్ధరించకపోవడంతో మండలంలోని గౌరీపట్నం మార్గంలో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. గత నెల మూడో వారంలో కాజ్‌వే కొట్టుకుపోగా, వడ్డాది వైపు నుంచి చోడవరం వచ్చే వాహనాలు గౌరీపట్నం మీదుగా రావాల్సి వస్తున్నది. అలాగే చోడవరం వైపు నుంచి పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు చీడికాడ మీదుగా వెళ్లాలంటే ఎక్కువ దూరం, అధిక సమయం ప్రయాణించాల్సి వస్తున్నది. దీంతో ఇటు నుంచి వెళ్లే వాహనాలు కూడా గౌరీపట్నం మీదుగానే నడుస్తుండడంతో ఈ మార్గంలో రద్దీ పెరిగిపోయింది. ఇది అసలే ఇరుకుగా వున్న సింగిల్ లేన్ కావడం, రెండువైపులా అ పంటపొలాలు ఉండడంతో వాహనాలు ఎదురైతే సులభంగా తప్పుకునే అవకాశం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ స్తంభిస్తున్నది. దీంతో చోడవరం నుంచి వడ్డాది చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు సైతం పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. కాగా విజయరామరాజుపేట కాజ్‌వే పనులు పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. ఇది పూర్తికావడానికి వారం రోజులు పట్టే అవకాశం వుంది. అప్పటి వరకు గౌరీపట్నం మార్గంలో వాహనాదాలకు ఇక్కట్లు తప్పవు.
పైల్ నంబర్28బిపిటి 4
పోటో రైట్‌అప్
28బిపిటి4 వడ్డాది వంతెన పై ట్రాిఫిక్ జాం
వడ్డాది వంతెన పై ట్రాఫిక్ జాం , బారులు తీరిన వాహనాలు.
బుచ్చెయ్యపేట సెప్టెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని వడ్డాది వంతెనపై ఆదివారం పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. వారపు సంతను ప్రధాన రహదారిపై నిర్వహించడం, రెండో తేదీన దసరా పండుగ సందర్భంగా వ్యాపారులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో రావడంతో ఈ సమస్య ఏర్పడింది. వంతెన మీద నుంచి మాడుగుల రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
. 28బిపిటి3: విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై కాజ్‌వే పునరుద్ధరణ పనులు చేస్తున్న దృశ్యం
శరవేగంగా తాచేరు కాజ్‌వే పునరుద్ధరణ పనులు
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై కాజ్‌వే పునరుద్ధరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎక్స్‌కవేటర్, క్రేన్ల సాయంతో సిమెంట్ తూరలను ఒక్కొక్కటిగా గెడ్డలో పేరుస్తూ, వాటిపై గ్రావెల్ వేసి రోలింగ్ చేసున్నారు. నదిలో నీటి ప్రవాహం ఉధృతంగానే ఉన్నప్పటికీ కాజ్‌వే పునరుద్ధరణ పనులను శరవేగంగా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి, వాహనాల రాకపోకలకు కాజ్‌వేను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.