లంబసింగిలో ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:49 PM
లంబసింగి ఘాట్‌లో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు లారీలు రహదారిపై నిలిచిపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు
చింతపల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): లంబసింగి ఘాట్‌లో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు లారీలు రహదారిపై నిలిచిపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మంగళవారం మధ్యాహ్నం బోడకొండమ్మ దేవాలయం సమీప మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు పక్కనుంచి వెళ్లబోతూ ఇరుక్కుపోయాయి. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం లారీలకు ఇరువైపులా అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.