కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:38 AM
ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై ‘గజిబిజి, గందరగోళం’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కూడళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందిలో కొందరు వాహనాల రాకపోకలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండడం, సిగ్నల్ జంప్ చేసిన వాహనాలను చూసీచూడనట్టు వదిలేస్తుండడంపై ఫొటోలతో సహా కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించారు.
రోడ్డుపై నిల్చుని వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ హెచ్చరిక
సమయపాలన తప్పనిసరి
రద్దీ వేళల్లో చలాన్‌ల వసూళ్ల జోలికి వెళ్లొద్దని ఆదేశం
విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై ‘గజిబిజి, గందరగోళం’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కూడళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందిలో కొందరు వాహనాల రాకపోకలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండడం, సిగ్నల్ జంప్ చేసిన వాహనాలను చూసీచూడనట్టు వదిలేస్తుండడంపై ఫొటోలతో సహా కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించారు. దీనిపై ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్‌లో ట్రాఫిక్ సీఐలను ఆరాతీశారు. సమయపాలన పాటించని, విధి నిర్వహణ సమయంలో ఫోన్‌లో మాట్లాడుతూ, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సీఐ కూడా తమ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేసి ట్రాఫిక్ పరిస్థితి, సిబ్బంది పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై మాత్రమే దృష్టిపెట్టాలని, ఆ సమయంలో చలాన్‌ల వసూళ్ల జోలికి వెళ్లకుండా రోడ్లపై నిలబడి విధులు నిర్వర్తించాలని స్పష్టంచేశారు. ప్రజలు తమను గమనిస్తుంటారనే విషయాన్ని సిబ్బందికి వివరించాలని, నిబద్ధతతో విధులు నిర్వర్తించేలా సమాయత్తం చేయాల్సిన బాధ్యత సీఐలదేనని ఏడీసీపీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రఽధాన కూడళ్ల వద్ద సిబ్బంది రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించడం కనిపించింది. ఫోర్త్ టౌన్ సమీపంలో శంకరమఠం రోడ్డు కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని ‘ఆంధ్రజ్యోతి’లో ఫొటోలు ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు.