వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:32 PM
మండలంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు సోమవారం సైతం పర్యాటకుల తాకిడి నెలకొంది.
జి.మాడుగులలో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు సోమవారం సైతం పర్యాటకుల తాకిడి నెలకొంది. వాస్తవానికి ప్రతి శని, ఆదివారం పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులుండడం సహజం. కాని అందుకు భిన్నంగా వంజంగి హిల్స్‌ను సోమవారం కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ప్రస్తుతం మంచు కురుస్తూ వాతావరణం సుందరంగా ఉండడంతో పర్యాటకులు పెరిగారని స్థానికులు అంటున్నారు.
జి.మాడుగులలో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రత
ఏజెన్సీలో శీతాకాలం నేపథ్యంలో క్రమంగా ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. దీంతో చలి కొంతమేరకు పెరిగింది. సోమవారం జి.మాడుగులలో 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ముంచంగిపుట్టులో 12.8, పెదబయలులో 13.8, అరకులోయ, డుంబ్రిగుడలో 14.1, పాడేరులో 14.9, చింతపల్లిలో 15.0, హుకుంపేటలో 15.2, కొయ్యూరులో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.