Share News

వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:49 PM

మండలంలోని వంజంగి మేఘాల కొండకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది.

వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి
వంజంగి మేఘాల కొండపై పర్యాటకులు

పాడేరురూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని వంజంగి మేఘాల కొండకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజులుగా మన్యం వాతావరణంలో మార్పులు, చలి, మంచుతీవ్రత అధికం కావడంతో మన్యంలోని పర్యాటక కేంద్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన వంజంగి మేఘాల కొండపై పాల సముద్రాన్ని తలపించే విధంగా కనిపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకుంటూ వచ్చే భానుడి కిరణాలను చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. శనివారం మేఘాల కొండను 12 వేల మంది పర్యాటకులు సందర్శించడంతో ఎకో టూరిజానికి రూ.80 వేల ఆదాయం వచ్చిందని అటవీశాఖాధికారులు తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 11:49 PM