లంబసింగిలో పర్యాటకుల తాకిడి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:37 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది.
ఐదు గంటల నుంచే సందడి
ప్రకృతి అందాలను ఆస్వాదించిన టూరిస్టులు
చింతపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ శనివారం ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్, చెరువులవేనంలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం సాయంత్రం వరకు పర్యాటకులతో రద్దీగా కనిపించింది.