Share News

నేడు పాలీసెట్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:03 AM

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్‌-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో 14 కేంద్రాలు, నర్సీపట్నంలో 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

నేడు పాలీసెట్‌

అనకాపల్లి, నర్సీపట్నంలో 23 కేంద్రాలు

9,022 మంది అభ్యర్థులు

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష

అనకాపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్‌-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో 14 కేంద్రాలు, నర్సీపట్నంలో 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అనకాపల్లి కేంద్రాల్లో 6,574 మంది, నర్సీపట్నం కేంద్రాల్లో 2,338 మంది.. మొత్తం 9,022 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లతో గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరువాలి. బాల్‌పాయింట్‌ (బ్లాక్‌) పెన్ను, హెచ్‌బీ/2బీ పెన్సిల్‌, ఎరైజర్‌, షార్పనర్‌ మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ఎటువంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను (ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్టు వాచ్‌లు వంటివి) అనుమతించరు.

Updated Date - Apr 30 , 2025 | 01:03 AM