Share News

నేడు ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్న అప్పన్న

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:06 AM

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి మంగళవారం ఉత్తరద్వారంలో దర్శనమివ్వనున్నారు.

నేడు ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్న అప్పన్న

ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు అవకాశం

ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధం

సింహాచలం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి మంగళవారం ఉత్తరద్వారంలో దర్శనమివ్వనున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఒంటి గంటకు స్వామికి సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు చేస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అయ్యవారి సేవ, మేలిముసుగులతో బేడా తిరువీధి నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలకు ఆలయ ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజల అనంతరం అనువంశిక ధర్మకర్త, వారి కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పిస్తారు. ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకూ ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై వైకుంఠవాసుడి అలంకారంలో శేషపాన్పుపై స్వామివారు సామాన్య భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - Dec 30 , 2025 | 01:06 AM