చక్కని వసతి సమకూరేలా..
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:07 AM
వెనుక బడిన తరగతుల వసతి గృహాలకు మంచి రోజులు రానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీ హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయకృష్ణన్ సీఎస్‌ఆర్ నిధులతో వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు బీసీ వసతి గృహాలను సందర్శించి చేపట్టాల్సిన పనులను గుర్తించారు.
బీసీ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
- సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ యోచన
- పనులను గుర్తించిన అధికారులు
- కలెక్టర్‌కు చేరిన ప్రతిపాదనలు
నర్సీపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వెనుక బడిన తరగతుల వసతి గృహాలకు మంచి రోజులు రానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీ హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయకృష్ణన్ సీఎస్‌ఆర్ నిధులతో వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు బీసీ వసతి గృహాలను సందర్శించి చేపట్టాల్సిన పనులను గుర్తించారు.
జిల్లాలో 37 బీసీ ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, 12 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 4,226 మంది విద్యార్థులు, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 1,262 మంది కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 29 వసతి గృహాలకు మరమ్మతులు చేయించడానికి రూ.6.66 కోట్లతో అంచనాలు తయారు చేసి జిల్లా బీసీ సంక్షేమ అధికారికి అందజేశారు. గుర్తించిన పనుల్లో మరుగుదొడ్లు, శ్లాబుల లీకేజీలు, తలుపులు, కిటీకీల రెక్కలు అమర్చడం, ఎలక్ర్టికల్ పనులు ఉన్నాయి. భవనాలకు రంగులు వేయించడం వంటి పనులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు బీసీ సంక్షేమ శాఖ నుంచి కలెక్టర్‌కు వెళ్లాయి.
అధికారులు గుర్తించిన పనులు
బుచ్చెయ్యపేట బీసీ బాలుర వసతి గృహంలో రూ.24.7 లక్షలతో మరమ్మతలు చేయాలని గుర్తించారు. చీడికాడ మండలం అప్పలరాజుపురం బీసీ బాలుర వసతి గృహానికి రూ.16.7 లక్షలు, చీడికాడ మండలం తురువోలు బీసీ బాలుర వసతి గృహానికి రూ.17.8 లక్షలు, చోడవరం బీసీ బాలుర వసతి గృహానికి రూ.23 లక్షలు, గొలుగొండ బాలుర వసతి గృహానికి రూ.26.8 లక్షలు, రావికమతం బీసీ బాలికల వసతి గృహానికి రూ.30 లక్షలు, రోలుగుంట బీసీ బాలుర హాస్టల్‌కు రూ.36 లక్షలు, వి.మాడుగుల బీసీ బాలుర వసతి గృహానికి రూ.27 లక్షలు, వి.మాడుగుల మండలం కింతలి బీసీ బాలుర వసతి గృహానికి రూ.26.6 లక్షలు, కోటవురట్ల ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్‌కు రూ.27 లక్షలు, నక్కపల్లి మండలం గొడ్డిచర్ల బీసీ బాలుర వసతి గృహానికి రూ.30 లక్షలు, నర్సీపట్నం మండలం వేములపూడి ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు రూ.39 లక్షలు, వేములపూడి బీసీ బాలికల వసతి గృహానికి రూ.39 లక్షలు, నర్సీపట్నం బీసీ బాలికల వసతి గృహానికి రూ..25.7 లక్షలు, నర్సీపట్నం బీసీ బాలుర వసతి గృహానికి రూ.28 లక్షలు, ఎస్.రాయవరం బీసీ బాలుర వసతి గృహానికి రూ.22 లక్షలు, దేవరాపల్లి బీసీ బాలుర వసతి గృహానికి రూ.27 లక్షలు, కె.కోటపాడు బీసీ కళాశాల బాలుర వసతి గృహానికి రూ.34.6 లక్షలు, కె.కోటపాడు మండలం కోరువాడం బీసీ బాలుర వసతి గృహానికి రూ.32.2 లక్షలు, పరవాడ మండలం లంకెలపాలెం బీసీ బాలుర వసతి గృహానికి రూ.25 లక్షలు, తానాం బీసీ బాలుర వసతి గృహానికి రూ.20 లక్షలతో మరమ్మతులు చేయించాలని ప్రతిపాదించారు.
ఏపీఈడబ్ల్యూఐడీసీ ప్రతిపాదించిన పనులు
అనకాపల్లిలో బీసీ బాలికల కళాశాల వసతి గృహానికి రూ.3 లక్షలు, బీసీ బాలుర గృహానికి రూ.12.4 లక్షలు, గోవాడ బీసీ బాలికల వసతి గృహానికి రూ.12.5 లక్షలు, కశింకోట బీసీ బాలుర వసతి గృహానికి రూ.5.2 లక్షలు, పాయకరావుపేట బీసీ బాలుర కళాశాల వసతి గృహానికి రూ.17.5 లక్షలు, రావులమ్మపాలెం బీసీ బాలుర వసతి గృహానికి రూ.18 లక్షలు, మల్లునాయుడుపాలెం బీసీ బాలుర వసతిగృహానికి రూ.7.5 లక్షలు, ఎలమంచిలి బీసీ బాలుర కళాశాల వసతి గృహానికి రూ.12.5 లక్షలతో మరమ్మతులు చేయాలని ఏపీ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ అధికారులు ప్రతిపాదించారు.