Share News

ఉపమాకలో తిరుపతి లడ్డూ ప్రసాదాల విక్రయం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:32 AM

ఉపమాక క్షేత్రంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరుపతి లడ్డూ ప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.

ఉపమాకలో తిరుపతి లడ్డూ ప్రసాదాల విక్రయం
లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తున్న హోం మంత్రి అనిత

నక్కపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉపమాక క్షేత్రంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరుపతి లడ్డూ ప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల సందర్భంగా సోమవారం లడ్డూ ప్రసాదాల విక్రయాలను ప్రారంభించారు. ఈ ఏడాది వెంకన్న కల్యాణోత్సవాల సమయంలో తిరుపతి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో వుంచాలని హోం మంత్రి అనితను స్థానిక నాయకులు కోరారు. ఆమె ఈ విషయమై టీటీడీ ఈవో, చైర్మన్‌లతో మాట్లాడారు. దీంతో సోమవారం లడ్డూ ప్రసాదాల విక్రయాలను ప్రారంభించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు ఉపమాక వేంకటేశ్వరస్వామి ముఖచిత్రంతో ముద్రించిన క్యాలెండర్లను హోం మంత్రి అనిత అవిష్కరించారు. ఆమె వెంట ఆలయ మాజీ చైర్మన్‌ కొప్పిశెట్టి బుజ్జి, టీడీపీ నాయకులు వెంకటేశ్‌, కొండబాబు, కురందాసు నూకరాజు తదితరులు వున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:32 AM