రోడ్డు మధ్యలో కూరుకుపోయిన టిప్పర్ లారీ
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:12 AM
రావికమతం- తట్టబంద మార్గంలో మరుపాక పంచాయతీ దాసరయ్యపాలెం వద్ద భారీ టిప్పర్ లారీ రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో సుమారు ఏడు గంటలపాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరుపాకలోని ఒక క్వారీ నుంచి బండరాళ్ల లోడుతో రాంబిల్లి మండలంలో ఏఎన్‌ఓబీకి వెళుతున్న టిప్పర్ లారీ శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రావికమతం వైపు వస్తున్నది.
రావికమతం- తట్టబంద మార్గంలో ఏడు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
రావికమతం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రావికమతం- తట్టబంద మార్గంలో మరుపాక పంచాయతీ దాసరయ్యపాలెం వద్ద భారీ టిప్పర్ లారీ రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో సుమారు ఏడు గంటలపాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరుపాకలోని ఒక క్వారీ నుంచి బండరాళ్ల లోడుతో రాంబిల్లి మండలంలో ఏఎన్‌ఓబీకి వెళుతున్న టిప్పర్ లారీ శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రావికమతం వైపు వస్తున్నది. దాసరయ్యపాలెం వద్ద రోడ్డు మధ్య కూరుకుపోయింది. ట్రాక్టర్ల సహాయంతో టిప్పర్ లారీని బయటకు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. అనకాపల్లి నుంచి రావికమతం వచ్చే ఆర్టీసీ బస్సులను మరుపాక నుంచి వెనక్కు మళ్లించారు. రావికమతం ఎస్‌ఐ ఎం.రఘువర్మ వచ్చి అనకాపల్లి నుంచి భారీ ఎక్స్‌కవేటర్, క్రేన్లను రప్పించారు. చాలా సేపు శ్రమించిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు టిప్పర్ లారీని బయటకు తీశారు. పరిమితికి మించి బండరాళ్లను రవాణా చేస్తున్నందుకు ఓవర్ లోడ్ కింద టిప్పర్ లారీకి రూ.34,305 అపరాధ రుసుం విధించినట్టు ఎస్‌ఐ చెప్పారు.