అదుపుతప్పిన టిప్పర్ లారీ
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:49 AM
మండలంలోని జంగాలపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం టిప్పర్ లారీ అదుపుతప్పి బస్ షెల్టర్‌ను ఢీకొన్నది. ఈ సంఘటనలో టిప్పర్ లారీ పక్కకు ఒరగ్గా, బస్‌షెల్టర్ శ్లాబ్ మొత్తం కుప్పకూలింది.
బస్‌షెల్టర్‌ను ఢీకొనడంతో కుప్పకూలిన కట్టడం
రాంబిల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జంగాలపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం టిప్పర్ లారీ అదుపుతప్పి బస్ షెల్టర్‌ను ఢీకొన్నది. ఈ సంఘటనలో టిప్పర్ లారీ పక్కకు ఒరగ్గా, బస్‌షెల్టర్ శ్లాబ్ మొత్తం కుప్పకూలింది. అనకాపల్లి నుంచి రాజుకోడూరుకు మెటల్‌ను రవాణా చేస్తున్న టిప్పర్ లారీ.. జంగాలపాలెం వద్ద లూప్‌లైన్‌లో నుంచి ఆకస్మికంగా వచ్చిన పాల వ్యాన్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పింది. రోడ్డు పక్కన వున్న బస్‌షెల్టర్‌ను బలంగా ఢీకొని పక్కకు ఒరిగింది. బస్‌షెల్టర్ మొత్తం కుప్పకూలింది. లారీ ముందుభాగం నుజ్జయ్యింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. టిప్పర్ లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.