జాతరకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 AM
ముత్యాలమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం చింతపల్లిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్టులు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసులు, ఉత్సవ కమిటీకి పలు సూచనలు చేశారు.
- 300 మంది పోలీసులు, 20 మంది అధికారుల నియామకం
- ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
చింతపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ముత్యాలమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం చింతపల్లిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్టులు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసులు, ఉత్సవ కమిటీకి పలు సూచనలు చేశారు. జాతరలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు 300కి పైగా పోలీసులతో పాటు సివిల్, ఏపీఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులు, 20 మంది పోలీసు అధికారులను నియమించామన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల నుంచి జిల్లా పరిషత్, ఏపీఆర్ కళాశాల వరకు పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. అత్యవసర సహాయం కోసం 112, 9440904238, 9440904239, 9494157957 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మద్యం దుకాణాల యజమానులు రాత్రి పది గంటల వరకు మాత్రమే విక్రయించాలన్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ వెంకటరమణ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దురియా హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వినాయకరావు, కార్యదర్శి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు వున్నారు.