Share News

రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్లుగా ముగ్గురు ఎంపిక

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:38 AM

పాధ్యాయ దినోత్సవం పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో జిల్లాకు చెందిన ముగ్గురు టీచర్లకు అవకాశం దక్కింది.

రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్లుగా ముగ్గురు ఎంపిక
మత్స్యపురం స్కూల్‌ టీచర్‌ ఎం.సత్యారావు

రోజారాణి, రాంబాబు, సత్యారావుకు దక్కిన గౌరవం

పాడేరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో జిల్లాకు చెందిన ముగ్గురు టీచర్లకు అవకాశం దక్కింది. జిల్లాలో అరకులోయ మండలం కంఠబౌన్సుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తున్న శెట్టి రోజారాణి, అనంతగిరి మండలం చిలకలగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్న శెట్టి రాంబాబు, హుకుంపేట మండలం మత్స్యపురంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌ ఎం.సత్యారావు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ నెల 5న అమరావతిలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక కావడంపై పలువురు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:38 AM