Share News

ముగ్గురు కూటమి నేతలకు నామినేటెడ్‌ పదవులు

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:20 AM

మన్యానికి చెందిన ముగ్గురు కూటమి నేతలకు నామినేటెడ్‌ పదవులు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను గతంలోనే నియమించిన ప్రభుత్వం.. తాజాగా పాడేరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పాంగి రాజారావులను డైరెక్టర్లుగా నియమించింది.

ముగ్గురు కూటమి నేతలకు   నామినేటెడ్‌ పదవులు
బొర్రా నాగరాజు

జీసీసీ డైరెక్టర్లుగా బొర్రా నాగరాజు, పాంగి రాజారావు

ట్రైకార్‌ డైరెక్టర్‌గా వంపూరు గంగులయ్య

ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

పాడేరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మన్యానికి చెందిన ముగ్గురు కూటమి నేతలకు నామినేటెడ్‌ పదవులు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను గతంలోనే నియమించిన ప్రభుత్వం.. తాజాగా పాడేరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పాంగి రాజారావులను డైరెక్టర్లుగా నియమించింది. బొర్రా నాగరాజు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండగా, అరకులోయ నియోజకవర్గానికి చెందిన పాంగి రాజారావు గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున అరకులోయ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఇదిలావుండగా ట్రైబల్‌ కార్పొరేషర్‌ డైరెక్టర్‌గా జనసేన పార్టీ అరకులోయ పార్లమెంటరీ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్యను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జీసీసీ డైరెక్టర్‌గా నియమించగా, ఈ పదివిని ఆయన నిరాకరించారు. దీంతో ట్రైబల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Updated Date - Aug 09 , 2025 | 01:20 AM