ఇది కాలువ కాదు.. రోడ్డే!
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:35 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోని పూల్‌బాగ్ జంక్షన్ వద్ద రహదారులపై మురుగునీరు తాండవిస్తున్నది. ఆలయానికి వెళ్లే భక్తులతోపాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీ నిర్మాణంతో రహదారుపైకి మురుగు నీరు
అధ్వానంగా పూల్‌బాగ్ జంక్షన్
నూకాంబిక ఆలయానికి వెళ్లే భక్తుల ఇక్కట్లు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోని పూల్‌బాగ్ జంక్షన్ వద్ద రహదారులపై మురుగునీరు తాండవిస్తున్నది. ఆలయానికి వెళ్లే భక్తులతోపాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ అధికారులు ఇండోర్ స్టేడియం నుంచి పూల్‌బాగ్ జంక్షన్ వరకు ఇటీవల డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ప్రత్యామ్నాయం చూపకుండా పనులు చేపట్టడం వల్ల నూకాంబిక నగర్ రోడ్డులో మురుగునీరు నిలిచిపోయింది. ఇంకా పూల్‌బాగ్ వెళ్లే జంక్షన్ అంతా మురికికూపంలా తయారైంది. మురుగు నీరు నూకాంబిక ఆలయానికి వెళ్లే మార్గంలో ఒక పక్కన దుకాణాల ముందు నిలిచిపోయింది. జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి, మురుగు నీరు రహదారిపై ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.