కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:10 PM
వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు సైతం దట్టంగా కమ్మేస్తున్నది.
జి.మాడుగులలో 7.0 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు సైతం దట్టంగా కమ్మేస్తున్నది. జిల్లా కేంద్రం పాడేరుతో సహా ఏజెన్సీలో మంగళవారం ఉదయం పదిన్నరగంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. తాజా శీతల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మంగళవారం జి.మాడుగులలో 7.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అరకులోయలో 7.1, ముంచంగిపుట్టులో 7.8, డుంబ్రిగుడలో 8.2, పెదబయలులో 9.9, చింతపల్లిలో 10.7, హుకుంపేటలో 11.2, పాడేరులో 11.3, కొయ్యూరులో 13.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు కురుస్తూనే ఉంది. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతు కూలీలు, ఉద్యోగులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.