Share News

ఎరువుల కొరత లేదు

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:58 AM

జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని మండలాల్లో రైతులకు అవసరాకు సరిపడ నిల్వలు వున్నాయని అనకాపల్లి ఆర్డీవో షేక్‌ ఆయీషా తెలిపారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్టు ఒక పత్రికలో (ఆంధ్రజ్యోతి కాదు) వచ్చిన వార్తపై జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్డీవోతోపాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్‌రావు, మండల ప్రత్యేక అధికారి మంజులావాణి గురువారం ఇక్కడకు వచ్చి రైతు సేవా కేంద్రంలో తనిఖీలు చేశారు. మండలానికి ఇంతవరకు వచ్చిన ఎరువులు, రైతులకు అందజేసిన ఎరువులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు.

ఎరువుల కొరత లేదు
దేవరాపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా స్టాక్‌ రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో షేక్‌ ఆయీషా, వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్‌రావు

రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నది

ఆర్డీవో షేక్‌ ఆయీషా

ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే డీలర్ల లైసెన్సు రద్దు చేస్తాం

వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రావు

దేవరాపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని మండలాల్లో రైతులకు అవసరాకు సరిపడ నిల్వలు వున్నాయని అనకాపల్లి ఆర్డీవో షేక్‌ ఆయీషా తెలిపారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్టు ఒక పత్రికలో (ఆంధ్రజ్యోతి కాదు) వచ్చిన వార్తపై జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్డీవోతోపాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్‌రావు, మండల ప్రత్యేక అధికారి మంజులావాణి గురువారం ఇక్కడకు వచ్చి రైతు సేవా కేంద్రంలో తనిఖీలు చేశారు. మండలానికి ఇంతవరకు వచ్చిన ఎరువులు, రైతులకు అందజేసిన ఎరువులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని చెప్పారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్‌ల మేరకు రైతు సేవా కేంద్రాలకు, పీఏసీఎస్‌లకు యూరియా సరఫరా చేశామన్నారు. ఒకవేళ అదనంగా ఎరువులు అవసరమైతే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని, సత్వరమే ఎరువులు పంపడానికి చర్యలు చేపడతామని ఆమె చెప్పారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్‌రావు మాట్లాడుతూ, దేవరాపల్లి మండలంలో పది వేల ఎకరాల్లో వరినాట్లు వేశారని, 19 రైతు సేవా కేంద్రాలకు 760 టన్నులకుగాను ఇంతవరకు 540 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని వివరించారు. రెండు, మూడు రోజుల్లో 52 టన్నుల యూరియా వస్తుందని, షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల రెండవ వారంలో 60 టన్నులు, మూదో వారంలో 60 టన్నులు ఇస్తామన్నారు. ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే లైసెన్సు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు యూరియా, పొటాష్‌, డీఏపీ ఎరువులను నిర్ణీత మోతాదులో పంటలకు వేయాలని, కానీ పొటాష్‌, డీఏపీ రేటు ఎక్కువ వుండడంతో కొంతమంది రైతులు యూరియాను మోతాదుకు మించి వాడుతున్నట్టు తమ సిబ్బంది దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఇతర రైతులకు సకాలంలో యూరియా అందదని, మరోవైపు అధిక యూరియా వాడకం వల్ల పంటలను తెగుళ్లు త్వరగా ఆశించే ప్రభావం వుందన్నారు. వీరి వెంట తహశీల్దారు లక్ష్మీదేవి, వ్యవసాయ అధికారి ఎల్‌.వై.కాంతమ్మ, విస్తరణ అధికారి కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ పి.సత్యనారాయణ వున్నారు.

నిరంతరం యూరియా సరఫరా: కలెక్టర్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ డీలరుల్ల, పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల్లో 895.11 టన్నుు యూరియా అందుబాటులో ఉందన్నారు. పది రోజుల్లో మరో 1,500 టన్నుల యూరియా జిల్లాకు రానున్నదని చెప్పారు. ఈ నెలలో ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు 730 టన్నులు, ప్రైవేటు డీలర్లకు 294 టన్నులు సరఫరా అయ్యిందని, ఐదో తేదీన కోరమాండల్‌ నుంచి 250 టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. ఈ నెల రెండు, మూడు వారాల్లో మరింత యూరియా జిల్లాకు రానున్నదని, అందువల్ల రైతులు అవసరాలకు మించి ఎరువులు కొనుగోలు చేయవద్దని కలెక్టర్‌ కోరారు.

Updated Date - Sep 05 , 2025 | 12:58 AM