కొట్టుకుపోయిన కోడిగెడ్డ వంతెన
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:22 PM
అరకులోయ నుంచి చొంపికి వెళ్లే మార్గంలో కోడిగెడ్డపై ఉన్న వంతెన గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో 80 గ్రామాల ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
80 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం
అరకులోయ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):
అరకులోయ నుంచి చొంపికి వెళ్లే మార్గంలో కోడిగెడ్డపై ఉన్న వంతెన గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో 80 గ్రామాల ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అరకులోయ నుంచి చొంపి, సిరగాం, బస్కీ పంచాయతీల పరిధిలోని 80 గ్రామాల ప్రజలకు ఈ వంతెన ఆధారం. ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాల వాహనచోదకులు మాడగడ, బోసుబెడ్డ మీదుగా అరకులోయకు చుట్టూ తిరిగి రావలసి వస్తోంది. పాదచారులు మాత్రం గెడ్డ దాటుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు.