Share News

సంప్రదాయంగా నరకాసురుడి వధ

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:57 AM

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక గవరపాలెం పీలా వారి గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద భక్తుల కోలాహలం మధ్య నరకాసురుని వధ జరిగింది. నిర్వాహకులు సుమారు 15 అడుగుల ఎత్తున నరకాసురుడి దిష్టిబొమ్మను తయారు చేశారు.

సంప్రదాయంగా నరకాసురుడి వధ
దహనం అవుతున్న నరకాసురుడి దిష్టిబొమ్మ

అనకాపల్లిలో భారీ దిష్టిబొమ్మ దహనం

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక గవరపాలెం పీలా వారి గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద భక్తుల కోలాహలం మధ్య నరకాసురుని వధ జరిగింది. నిర్వాహకులు సుమారు 15 అడుగుల ఎత్తున నరకాసురుడి దిష్టిబొమ్మను తయారు చేశారు. ఇందులో పలు రకాల బాణసంచా సామగ్రిని నింపారు. దిష్టిబొమ్మకు ఆలయ గౌరవాధ్యక్షుడు కొణతాల రఘునాథ్‌ నిప్పుంటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు గవరపాలెంతోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు. గౌరీ పరమేశ్వరుల ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్‌ భీమరశెట్టి వరహా నూకరాజు, అధ్యక్షుడు భీమరశెట్టి మహాలక్ష్మినాయుడు, కార్యదర్శి బుద్ద శివ, కోశాధికారి భీమరశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:57 AM