Share News

గిరి మహిళల కన్నీటి కష్టాలు

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:21 PM

మండలంలోని తాజంగి గ్రామ పంచాయతీ సిరగంపుట్టు వీధి మహిళలకు నీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో మూడేళ్ల క్రితం మంజూరైన జల్‌జీవన్‌ రక్షిత మంచినీటి పథకం ఇప్పటి వరకు పూర్తికాలేదు. పనులు అర్ధాంతంగా నిలిచిపోయాయి.

గిరి మహిళల కన్నీటి కష్టాలు
రెండు మైళ్ల దూరం నుంచి నీళ్లు మోసుకొస్తున్న సిరగంపుట్టు మహిళలు

తాజంగి సిరగంపుట్టు వీధిలో సమస్యలు

రెండు మైళ్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న వైనం

చింతపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి గ్రామ పంచాయతీ సిరగంపుట్టు వీధి మహిళలకు నీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో మూడేళ్ల క్రితం మంజూరైన జల్‌జీవన్‌ రక్షిత మంచినీటి పథకం ఇప్పటి వరకు పూర్తికాలేదు. పనులు అర్ధాంతంగా నిలిచిపోయాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో స్థానిక గిరిజన మహిళలు రెండు మైళ్ల దూరంలో ఉన్న ఊటగెడ్డ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. ఊటగెడ్డ దూరంగా ఉండడంతో రెండు, మూడుసార్లు నీళ్ల కోసం వెళ్లడం భారంగా వుందని, ఒకేసారి మహిళలు శిరస్సుపై నాలుగు, ఐదు బిందెలను మోసుకొని వస్తున్నారు. అధిక బరువు శిరస్సుపై మోసుకురావడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:21 PM