Share News

‘హోమీబాబా’ ఆస్పత్రిలో మొరాయించిన సర్వర్‌

ABN , Publish Date - May 05 , 2025 | 11:55 PM

హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రిలో వైద్యం పొందేందుకు వచ్చిన పేద రోగులకు సోమవారం చుక్కలు కనిపించాయి. క్యాన్సర్‌ వైద్యం కోసం రోగులు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం సుమారు ఐదు వందల మంది ఇక్కడకు వస్తుంటారు.

‘హోమీబాబా’ ఆస్పత్రిలో మొరాయించిన సర్వర్‌
క్యూలో వేచివున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు

తీవ్ర ఇబ్బందులకు గురైన క్యాన్సర్‌ రోగులు

అగనంపూడి, మే 5 (ఆంధ్రజ్యోతి): హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రిలో వైద్యం పొందేందుకు వచ్చిన పేద రోగులకు సోమవారం చుక్కలు కనిపించాయి. క్యాన్సర్‌ వైద్యం కోసం రోగులు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం సుమారు ఐదు వందల మంది ఇక్కడకు వస్తుంటారు. వీరిలో అధికంగా పేదలే ఉంటుండడంతో ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్యం పొందాలంటే ట్రస్టు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్‌ మొరాయించడంతో రోగులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. పది నిమిషాలకొకసారి సర్వర్‌ మొరాయించడంతో ఒక్కొక్కరి ఆమోదానికి సుమారు గంట సమయం పట్టింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్యాన్సర్‌ రోగులకు వారానికి ఒకసారి చేసే కీమో వైద్యానికి తప్పనిసరిగా ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవా ట్రస్టులో ఆమోదం తీసు కోవాలి. అయితే సర్వర్‌ మొరాయించడంతో రోగులు అవస్థలు వర్ణనాతీతంగా మారింది. జిల్లా ఉన్నాతాధికారులు చొరవ తీసుకుని ఆస్పత్రిలో సర్వర్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు.

Updated Date - May 05 , 2025 | 11:56 PM