అథ్లెటిక్స్ మీట్‌లో సత్తాచాటిన పరుగుల బామ్మ
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:39 AM
పరుగుల బామ్మగా... పతకా బామ్మగా పేరొందిన స్థానిక వెటరన్ క్రీడాకారిణి ముత్యం లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అఽథ్లెటిక్స్ మీట్‌లో మరోసారి సత్తాచాటారు.
ముడు పసిడి పతకాలను సాధించిన ముత్యం లక్ష్మి
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ప్ పోటీలకు ఎంపిక
చోడవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
పరుగుల బామ్మగా... పతకా బామ్మగా పేరొందిన స్థానిక వెటరన్ క్రీడాకారిణి ముత్యం లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అఽథ్లెటిక్స్ మీట్‌లో మరోసారి సత్తాచాటారు. వివిధ ఈవెంట్లలో ఏకంగా మూడు స్వర్ణపతకాలు సాధించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన 45వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 70 ఏళ్ల ప్లస్ విభాగంలో ముత్యం లక్ష్మి జావెలిన్ త్రో, డిస్క్ త్రో, షాట్‌పుట్‌లో మొదటి స్థానాల్లో నిలిచి పసడి పతకాలను సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రాజస్థాన్‌ని అజ్మీర్‌లో జరగనున్న జాతీయస్థాయి మాస్టర్స్ అఽథ్లెటిక్స్ పోటీలకు ఆమె ఎంపికయ్యారు.