తాండవలో పెరుగుతున్న నీటినిల్వలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:41 AM
తాండవ రిజర్వాయర్ ఎగువున వున్న కొయ్యూరు, గొలుగొండ మండలాల్లో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది.
రిజర్వాయర్‌లోకి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాతవరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తాండవ రిజర్వాయర్ ఎగువున వున్న కొయ్యూరు, గొలుగొండ మండలాల్లో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 372.6 అడుగులు వుంది. ఎగువ నుంచి గెడ్డల ద్వారా 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం తాండవలో ఉన్న నీరు ఆయకట్టుకు 75 రోజుల వరకు సరిపోతుందని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వున్నందున ఖరీఫ్ వరిసాగుకు నీటి ఎద్దడి వుండదని ప్రాజెక్టు డీఈఈ అనురాధ చెప్పారు.