Share News

వీడని వాన

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:59 PM

మండలంలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా వర్షం వీడకపోవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది.

వీడని వాన
ముంచంగిపుట్టులో వర్షం

ముంచంగిపుట్టు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండలంలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా వర్షం వీడకపోవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురడంతో మండలంలోని బూసిపుట్టు వారపు సంత వెలవెలబోయింది. వ్యాపారాలు లేక వర్తకులు డీలా పడ్డారు. వర్షం కారణంగా వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు పలు చోట్ల కోతకు గురయ్యాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:59 PM