Share News

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:23 AM

ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సుల్లో, డిపోల్లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారాన్ని ప్లాస్టిక్‌ నిషేధ దినంగా ప్రకటిస్తూ శనివారం ద్వారకా కాంప్లెక్సులో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలి
ద్వారకా కాంప్లెక్స్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఆర్టీసీ ఆధికారులు, సిబ్బంది

కాంప్లెక్స్‌ల్లో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు

ఆర్టీసీ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు

ద్వారకాబస్‌స్టేషన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సుల్లో, డిపోల్లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారాన్ని ప్లాస్టిక్‌ నిషేధ దినంగా ప్రకటిస్తూ శనివారం ద్వారకా కాంప్లెక్సులో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రయాణికులకు వివరించి వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని, ఎవరైనా కాంప్లెక్స్‌ల్లోని స్టాల్స్‌లో ప్లాస్టిక్‌ కవర్లు, పాలిథిన్‌ బ్యాగులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పీబీఎంకే రాజు, ఏటీఎం (కమర్షియల్‌) బాపిరాజు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:23 AM