ఇంటి యజమాని భార్యే దొంగ
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:10 AM
రెండేళ్ల క్రితం జరిగిన చోరీ కేసును క్రైమ్ పోలీసులు ఛేదించారు. తమ ఇంట్లో అద్డెకు ఉంటున్న వారి బంగారం, వెండి ఆభరణాలను కాజేసిన ఇంటి యజమాని భార్యే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితురాలి నుంచి 14 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి స్టేషన్‌లో శనివారం క్రైమ్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సూరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నిందితురాలి నుంచి 14 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం
రెండేళ్ల క్రితం జరిగిన చోరీ కేసును ఛేదించిన పెందుర్తి క్రైమ్ పోలీసులు
పెందుర్తి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం జరిగిన చోరీ కేసును క్రైమ్ పోలీసులు ఛేదించారు. తమ ఇంట్లో అద్డెకు ఉంటున్న వారి బంగారం, వెండి ఆభరణాలను కాజేసిన ఇంటి యజమాని భార్యే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితురాలి నుంచి 14 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి స్టేషన్‌లో శనివారం క్రైమ్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సూరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నరవ సమీప సత్తివానిపా లెంలో సీతారామ గార్డెన్స్‌లో కొయ్యాన రమేశ్, శ్రావణి దంపతులు మూడేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. పరవాడలోని అరబిందో ఫార్మా కంపెనీలో రమేశ్ ఇంజనీర్‌గా చేస్తుండగా, శ్రావణి గృహిణి. వీరు అద్దెకుంటున్న మొదటి అంతస్తులో ఇంటి యజమాని చిట్యాడ ధర్మారావు, ఆయన భార్య సుజాత (50) ఉంటున్నారు. రమేశ్, శ్రావణిలకు కొత్తగా పెళ్లవ్వడంతో ఇంటి యజమాని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సుజాతను శ్రావణి పెద్దమ్మలా భావించేది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 22న రమేశ్ భార్య శ్రావ ణితో కలిసి అత్త వారింటికి వెళ్లారు. మూడు రోజుల తరువాత 26వ తేదీన తిరిగి ఇంటికి వచ్చారు. 27న ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించాలని వారు బెడ్ రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్‌లో చూడగా కనిపించలేదు. ఎక్కడో వాటిని పెట్టామని భావించి ఫంక్షన్‌కు వెళ్లి వాటి గురించి మరిచిపో యారు. ఆ తరువాత రమేశ్ ఆభరణాల గురించి భార్యను ఎప్పుడు అడిగినా.. ఎక్కడ తిడతారోనని భావించి వాటిని ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదని చెబుతూ ఆమె ఇల్లంతా వెదికేది. కాగా నెల 10న ఆభరణాల గురించి రమేశ్ భార్యను గట్టిగా నిలదీయడంతో రెండేళ్ల నుంచి కనిపించడం లేదని చెప్పింది. దీంతో ఆయన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్‌ఐ సూరిబాబు వారింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాగా తెలిసిన వాళ్లే చోరీకి పాల్ప డినట్టు భావించారు. రమేశ్ ఇంటికి తరచూ ఎవరు వస్తున్నారో ఆరా తీయగా.. ఇంటి యజమాని భార్య సుజాత అని దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె కదిలికలపై నిఘా పెట్టారు. ఆర్థిక అవసరాల కోసం ఓ బ్యాంకులో కాజేసిన ఆభరణాలను సుజాత తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో ఆమెను విచారించగా రమేశ్ తన భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ తాళంతో వారింట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు తెలిపింది. ఈ మేరకు సుజాతను అరెస్టు చేయడంతో పాటు రూ.15 లక్షల విలువైన బంగా రం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.