పొంగి ప్రవహిస్తున్న బండి గెడ్డ
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:03 PM
మండలంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి యు.చీడిపాలెం వెళ్లే ప్రధాన రహదారి మధఽ్య గొట్లపాడు వద్ద బండిగెడ్డ పొంగి ప్రవహిస్తోంది.
నిలిచిపోయిన 10 గ్రామాలకు రాకపోకలు
కొయ్యూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి యు.చీడిపాలెం వెళ్లే ప్రధాన రహదారి మధఽ్య గొట్లపాడు వద్ద బండిగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రమాదమని తెలిసినా కొందరు ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు వాగు ఉధృతి తగ్గకపోవడంతో యు.చీడిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సోమవారం విధులకు హాజరుకావాలంటే సాహసం చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే ఉల్లిగుంట, ఎర్రగొండ, తీగలమెట్ట, గంగవరం తదితర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ఈ వాగుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.