లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతం
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:36 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నళిన్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నళిన్ కుమార్ శ్రీవాస్తవ
చింతపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నళిన్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం లంబసింగి పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తిని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. న్యాయమూర్తి చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం, నిర్మాణంలోనున్న మ్యూజియం సందర్శించారు. లంబసింగి అందాలు బాగున్నాయని న్యాయమూర్తి అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ టి. రామకృష్ణ కూడా ఉన్నారు.