అతిథి అధ్యాపకుడి వికృత చేష్టలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:35 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిఽథి అధ్యాపకుడు ఓ విద్యార్థికి అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె విద్యార్థి సంఘాల నేతలకు చెప్పడంతో కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ వ్యహారంపై స్పందించిన ప్రిన్సిపాల్... విచారణ జరిపించి సదరు అతిఽథి అధ్యాపకునితో రాజీనామా చేయించారు. ఇందుకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
తనను ప్రేమించమంటూ ఓ విద్యార్థినికి వాట్సాప్ మెసేజ్‌లు
విద్యార్థి సంఘాల నేతల దృష్టికి తీసుకెళ్లిన బాధిత విద్యార్థిని
ఆందోళనకు దిగిన విద్యార్థులు.. విచారణ కమిటీ వేసిన ప్రిన్సిపాల్
గెస్ట్ లెక్చరర్ తీరుపై పలువురు ఫిర్యాదు
రాజీనామా చేయించిన ప్రిన్సిపాల్
నర్సీపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిఽథి అధ్యాపకుడు ఓ విద్యార్థికి అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె విద్యార్థి సంఘాల నేతలకు చెప్పడంతో కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ వ్యహారంపై స్పందించిన ప్రిన్సిపాల్... విచారణ జరిపించి సదరు అతిఽథి అధ్యాపకునితో రాజీనామా చేయించారు. ఇందుకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అతిథి అధ్యాపకుడిగా పని చేస్తున్న నారాయణరావు.. ఆర్ట్స్ గ్రూపు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ట్రాప్ చేయడానికి వాట్సాప్‌లో మేసేజ్ పెట్టాడు. తన మాజీ ప్రియురాలిలా ఉన్నావని, తనను ప్రేమించాలంటూ మేసేజ్‌లో పేర్కొన్నాడు. విద్యార్థిని ఈ విషయాన్ని విద్యార్థి సంఘాల నేతల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో గురువారం మధ్యాహ్నం విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు. అతిథి అధ్యాపకుడుని విధుల నుంచి తప్పించాలని, లేక పోతే తాము కళాశాల మానేస్తామని విద్యార్థినులు స్పష్టం చేశారు. దీంతో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు స్పందించి, నిజనిర్ధారణ కోసం ఐదుగురు అధ్యాపకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలువురు విద్యార్థినులను విచారించగా.. సదరు అతిథి అధ్యాపకుడి వ్యవహారశైలి సరిగా లేదంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రిన్సిపాల్‌ను కలిసి, నివేదికను ఆయన ముందుంచారు. దీంతో ప్రిన్పిపాల్ స్పందించి గెస్ట్ లెక్చరర్ నారాయణరావుతో రాజీనామా చేయించారు. విద్యార్థినులు ఆందోళన విరమించారు.