Share News

చెరువులా ‘పేట మెయిన్‌ రోడ్డు

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:39 AM

స్థానిక మెయిన్‌రోడ్డును రెండేళ్ల క్రితం అభివృద్ధి చేసిన అధికారులు... రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించకపోవడం, కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపై నిలిచిపోతున్నది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి మెయిన్‌రోడ్డుపై పలుచోట్ల నీరు నిలిచిపోయి చెరువులను తలపించింది.

చెరువులా ‘పేట మెయిన్‌ రోడ్డు
గౌతమ్‌ ఽథియేటర్‌ ఎదుట రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రహదారిపై నిలిచిపోతున్న వర్షం నీరు

రాకపోకలకు పాదచారులు, వాహనదారుల ఇక్కట్లు

పాయకరావుపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెయిన్‌రోడ్డును రెండేళ్ల క్రితం అభివృద్ధి చేసిన అధికారులు... రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించకపోవడం, కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపై నిలిచిపోతున్నది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి మెయిన్‌రోడ్డుపై పలుచోట్ల నీరు నిలిచిపోయి చెరువులను తలపించింది. వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై నీరు ప్రవహించడం, ఎక్కువసేపు నిలిచి వుండడంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్డు త్వరగా పాడైపోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రహదారికి ఇరువైపులా వ్యాపారాలు చేసుకుంటున్న వారు తమ దుకాణాల ఎదుట వర్షం నీరు నిలవకుండా వుండేందుకు మట్టి, గ్రావెల్‌, భవనాల వ్యర్థాలతో ఎత్తు చేసుకున్నారు. దీంతో రోడ్డుపై కురిసిన వర్షం నీరు ఎటూ వెళ్లలేక రోడ్డుపైనే నిలిచిపోతున్నది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన మోస్తరు వర్షానికి మెయిన్‌రోడ్డులో గౌతమ్‌, శ్రీలక్ష్మి ఽథియేటర్‌ ఎదుట వర్షపునీరు నిలలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికారులు వెంటనే స్పందించి మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:39 AM