ఆకట్టుకుంటున్న బర్డ్‌నెస్ట్
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:34 PM
మండలంలోని చిన్నగెడ్డ ఏపీఎఫ్‌డీసీ కాఫీ ఎస్టేట్‌లో సందర్శకుల కోసం అధికారులు ఏర్పాటు చేసిన బర్డ్‌నెస్ట్(పక్షి గూడు) అమితంగా ఆకట్టుకుంటోంది. లంబసింగి, చింతపల్లి సందర్శనకు వచ్చిన పర్యాటకులతో పాటు ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు బర్డ్‌నెస్ట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చిన్నగెడ్డ ఏపీఎఫ్‌డీసీ ఎస్టేట్‌లో సందర్శకుల కోసం ఏర్పాటు
చింతపల్లి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నగెడ్డ ఏపీఎఫ్‌డీసీ కాఫీ ఎస్టేట్‌లో సందర్శకుల కోసం అధికారులు ఏర్పాటు చేసిన బర్డ్‌నెస్ట్(పక్షి గూడు) అమితంగా ఆకట్టుకుంటోంది. లంబసింగి, చింతపల్లి సందర్శనకు వచ్చిన పర్యాటకులతో పాటు ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు బర్డ్‌నెస్ట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అరకులోయ మండలం సుంకరిమెట్ట కాఫీ తోటల వద్ద ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఏర్పాటు చేసిన ‘కేనోపి వాక్’(ఉడెన్ బ్రిడ్జి)కి పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో చిన్నగెడ్డ ఎస్టేట్ పరిధి పెదబరడ పంచాయతీ వంగసార గ్రామానికి సమీపంలో రెండెకరాల కాఫీ తోటల్లో ‘కాఫీ బెర్రీ పికింగ్ టూర్’ పేరిట సందర్శక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కాఫీ తోటల మధ్యలో ట్రెక్కింగ్ పాత్, ట్రీడెక్, బర్డ్‌నెస్ట్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు కాఫీ బెర్రీ పికింగ్ టూర్‌ను సందర్శించి బర్డ్‌నెస్ట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దీని సందర్శనకు ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఎటువంటి రుసుము వసూలు చేయడంలేదు. అయితే పర్యాటక సీజన్‌లో అదనపు సదుపాయాలు కల్పించి ప్రవేశ రుసుము, ఫొటో షూట్‌కి అదనపు నగదు వసూలు చేయనున్నారు.