ప్రధానోపాధ్యాయుడి ఉదారత
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:26 PM
తాళ్లపాలెం నంబర్ -3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత విద్యా సంవత్సరంలో మూసి వేశారు. ఆ విద్యార్థులను బంగారయ్యపేట నంబరు -1 పాఠశాలలో చేర్పించారు.
సొంత ఖర్చులతో విద్యార్థులకు ఆటో ఏర్పాటు
కశింకోట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తాళ్లపాలెం నంబర్ -3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత విద్యా సంవత్సరంలో మూసి వేశారు. ఆ విద్యార్థులను బంగారయ్యపేట నంబరు -1 పాఠశాలలో చేర్పించారు. తాళ్లపాలెం నుంచి బంగారయ్యపేట స్కూల్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండడంతో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాడి శ్రీనివాసరావు వారి కోసం సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేశారు. ఆటోకు ఆయన నెలకు రూ.1500 చెల్లిస్తున్నారు. ఆయనకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అభినందనలు తెలిపారు.