పెద్దపల్లకీలో పరంధాముడు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:33 AM
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఉపమాక క్షేత్రంలో సోమవారం ఉదయం శ్రీవారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది.
నక్కపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఉపమాక క్షేత్రంలో సోమవారం ఉదయం శ్రీవారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. పెద్ద పల్లకీలో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారు, చిన్న పల్లకీలో గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి మాఢవీధుల్లో మంగళవాద్యాల నడుమ ఊరేగించారు. అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో గోదాదేవి అమ్మవారి సన్నిధి వద్ద తిరుప్పావై పాశుర విన్నపం చేశారు.