అన్నదాతల ఆర్థికాభివృద్ధే సర్కారు లక్ష్యం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:21 PM
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే అన్నదాతల ఆర్థికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా రైతు సంబర సభ
పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే అన్నదాతల ఆర్థికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. పాడేరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘రైతు సంబర సభ’లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తామనే హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. తొలి విడతగా ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేలు చొప్పున జమ చేశారని, మరో రెండు విడతల్లో మిలిగిన రూ. 13వేలు జమ చేస్తారన్నారు. రైతులను అన్ని విధాలా అదుకునేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందన్నారు.
కూటమి పాలనలోనే రైతులకు న్యాయం
రైతులకు కూటమి ప్రభుత్వ పాలనలోనే న్యాయం జరుగుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గిరిజన ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి సీఎ చంద్రబాబునాయుడు రూ.202 కోట్లు మంజూరు చేశారని, దాని ద్వారా మరో లక్ష గిరిజన రైతు కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఈ సందర్భంగా కిడారి శ్రావణ్‌కుమార్, గిడ్డి ఈశ్వరి తదితరులు ముందర ట్రాక్టర్‌లో, కూటమి నేతలు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పోలుపర్తి గోవిందరావు, బొర్రా విజయరాణి, డప్పోడి వెంకటరమణ, డిప్పల శాంతికుమారి, పి.పాండురంగస్వామి, సాగర సుబ్బారావు, బాకూరు వెంకటరమణ, టి.సత్యనారాయణ, పి.శశిభూషన్, కె.ఉషారాణి, ఎల్.పార్వతమ్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కురుసా ఉమామహేశ్వరరావు, ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, ఏఎంసీ చైర్‌పర్సన్ మంగతల్లి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.