Share News

గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:17 AM

గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం మండలంలోని కుడుముసారి పంచాయతీ శివారు తురుబొంగులు-కిలుముల గ్రామాల మధ్య రూ.7.75 కోట్ల పీఎం జన్‌మన్‌ నిధులతో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, ఐదేళ్ల పాలనలో ఒక్క గ్రామానికి రోడ్డు నిర్మించలేదని ఆరోపించారు.

గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం పెద్దపీట
తురుబొంగులు-కిలుముల మధ్య రూ.7.75 కోట్ల చేపట్టనున్న తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న గిడ్డి ఈశ్వరి

టీడీపీ పాడేరు ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి

రూ.7.75 కోట్లతో తురుబొంగులు-కిలుముల మధ్య రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

చింతపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం మండలంలోని కుడుముసారి పంచాయతీ శివారు తురుబొంగులు-కిలుముల గ్రామాల మధ్య రూ.7.75 కోట్ల పీఎం జన్‌మన్‌ నిధులతో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, ఐదేళ్ల పాలనలో ఒక్క గ్రామానికి రోడ్డు నిర్మించలేదని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శివారు గ్రామాలకు రోడ్ల నిర్మాణం కోసం రూ.కోట్లు మంజూరు చేసిందన్నారు. చింతపల్లి మండలంలో అంజలి శనివారం గ్రామానికి రూ.2.84 కోట్లతో తారు రోడ్డు నిర్మించామన్నారు. దీంతో 24 గ్రామాల గిరిజనులకు రవాణా కష్టాలు తీరాయన్నారు. ఎ.శనివారంలోనే రూ.23 కోట్లతో 18 గ్రామాలకు కనెక్టివిటీ రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. తురుబొంగులు-కిలుములు మధ్య 7.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయితే 10 గ్రామాల గిరిజనులకు డోలీ మోతల బాధ తప్పుతుందని ఈశ్వరి చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది 34 వేల మందికి పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ సభ్యులు బాబూరావు, పార్వతి, టీడీపీ నాయకులు భీమన్న, గంగరాజు, గిరి, వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 01:17 AM