పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:50 PM
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్
జి.మాడుగుల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ పరదేశిపుట్టు పీవీటీజీ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కలెక్టర్ పెన్షన్ సొమ్ము లబ్ధిదారులకు అందజేసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంతో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. పెన్షన్‌దారులకు సమయానికి నగదు అందేలా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, తహశీల్దార్ జి.రాజ్‌కుమార్, ఎంపీడీవో ఎస్.డేవిడ్‌రాజు, సర్పంచ్ ఎం.చిలకమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు ఎస్.జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.