గిరి రైతులకు అధిక ఆదాయమే లక్ష్యం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:35 PM
గిరిజన రైతులకు అధిక ఆదాయమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
ఏడాది పొడవునా రాబడి రావాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న
పంటలను ప్రోత్సహించాలి
పాడేరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు అధిక ఆదాయమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో నూతన పంటలు, ఆదాయంపై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెగుళ్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేలా పంటల సాగు చేపట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు నష్టం కలగకుండా ఉండే పంటలను గుర్తించాలన్నారు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా అవకాడో, లిచీ, జాక్‌ఫ్రూట్, స్వీట్ ఆరెంజ్ వంటి పంటలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ప్రాథఽమిక పంటలైన కాఫీ, మిరియాలు నాణ్యత తగ్గకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రవాణా, సాగు పెట్టుబడులు తక్కువగా ఉంటూ, మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖల సమన్వయంతో గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే కాఫీ తోటల్లో నీడనిచ్చేందుకు నాటుతున్న సిల్వర్‌ఓక్ మొక్కలు ప్రత్యామ్నాయంగా తెగుళ్లను తట్టుకునే ఆదాయం ఇచ్చే మొక్కల పంపకాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళీ, ఇన్‌చార్జి డ్వామా పీడీ ఎల్.సీతయ్య, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా వ్యవసాయాధికారి కె.బాలకర్ణ, కాఫీ సీనియర్ లైజన్ అధికారి రమేశ్, ఆగ్రో కార్పస్ మేనేజర్ వి.రజియా, తదితరులు పాల్గొన్నారు.