బియ్యపు గింజపై వినాయకుని రూపం
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:17 PM
వినాయక చవితి సందర్భంగా వినాయకుని రూపాన్ని బియ్యపు గింజపై అద్భుతంగా చెక్కి మరోసారి తన కళానైపుణ్యాన్ని చాటుకున్నాడు మైక్రో ఆర్టిస్ట్ నైదండ గోపాల్.
మాడుగుల రూరల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా వినాయకుని రూపాన్ని బియ్యపు గింజపై అద్భుతంగా చెక్కి మరోసారి తన కళానైపుణ్యాన్ని చాటుకున్నాడు మైక్రో ఆర్టిస్ట్ నైదండ గోపాల్. మండలంలోని ఎం.కోడూరు గ్రామానికి చెందిన నైదండ గోపాల్ మైక్రో ఆర్టిస్ట్‌గా ఎన్నో సందర్భాల్లో పలు రకాల సూక్ష్మ కళాఖండాలు తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో గోపాల్ సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా మంగళవారం బియ్యపు గింజపై సన్నపాటి బ్లేడుని ఉపయోగించి బూతద్దం సాయంతో ఐదు గంటల పాటు సేపు శ్ర మించి అద్భుతంగా చెక్కి వాటర్ కలర్స్ అద్దాడు. గోపాల్ తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసి పలువురు అభినందించారు.