Share News

అడవి అంటుకుంది..

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:31 PM

మండలంలోని బొయింతి రిజర్వ్‌ ఫారెస్టులో మంటలు చెలరేగాయి. కొయ్యూరు సమీప మల్లికార్జునస్వామి ఆలయ వెనుక తూర్పు ప్రాంత అటవీ ప్రాంతంలో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి.

అడవి అంటుకుంది..
మల్లికార్జునస్వామి ఆలయం వెనుక రిజర్వ్‌ ఫారెస్టులో అగ్ని కీలలు ఎగిసి పడుతున్న దృశ్యం

బొయింతి రిజర్వు ఫారెస్టులో కార్చిచ్చు

మూడు రోజులుగా మండుతున్న అడవి

స్పందించని అటవీ శాఖ అధికారులు

అదుపు చేయాలని వేడుకుంటున్న జీడిమామిడి రైతులు

కొయ్యూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొయింతి రిజర్వ్‌ ఫారెస్టులో మంటలు చెలరేగాయి. కొయ్యూరు సమీప మల్లికార్జునస్వామి ఆలయ వెనుక తూర్పు ప్రాంత అటవీ ప్రాంతంలో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అడవిని ఆనుకొని ఉన్న జీడిమామిడి తోటలకు అగ్ని కీలాలు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన మూడు రోజులుగా మంటలు వ్యాపించినా అటవీశాఖాధికారులు పట్టించుకోలేదని వారంటున్నారు. జీడిమామిడి తోటల ఫలసాయం చేతికి అందే తరుణంలో అగ్ని ప్రమాద బారిన పడి నష్టపోతామనే భయాందోళనలు వారు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అడవి అంతా ఎండు ఆకులతో నిండి ఉండడంతోపాటు ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి కార్చిచ్చును అదుపు చేసే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 10:31 PM