మన్యాన్ని కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:13 PM
వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు.
జి.మాడుగులలో 11.4 డిగ్రీలు
పాడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు. ఏజెన్సీలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని విధంగా ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అలాగే చలి నుంచి రక్షణ పొందేందుకు మన్యం ప్రజలు చలి మంటలు కాగుతున్నారు. తాజా శీతల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఆదివారం జి.మాడుగులలో 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా డుంబ్రిగుడలో 12.7, ముంచంగిపుట్టులో 13.0, చింతపల్లిలో 13.3, పెదబయలు, హుకుంపేటలో 13.4, అరకులోయలో 13.5, పాడేరులో 14.0, అనంతగిరిలో 15.7, కొయ్యూరులో 16.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.