Share News

కన్నుల పండువగా జ్వాలాతోరణ మహోత్సవం

ABN , Publish Date - Nov 06 , 2025 | 01:26 AM

కన్నుల పండువగా జ్వాలాతోరణ మహోత్సవం

కన్నుల పండువగా జ్వాలాతోరణ మహోత్సవం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి కొత్త వెంకోజిపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం వద్ద జ్వాలా తోరణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో తోరణం కింద నుంచి మూడుసార్లు అటూఇటూ తిప్పారు. జ్వాలా తోరణాన్ని దర్శించుకున్నా, దాని కింద నడిచినా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే వేలాది మంది శివాలయాలకు తరలివస్తారు. జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలో అడుగుపెట్టే పరిస్థితి ఎదురుకాదని, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

Updated Date - Nov 06 , 2025 | 01:26 AM