‘తొలి అడుగు’ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:23 AM
జిల్లాలో నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. అనకాపల్లిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, అమలు పరిచిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు జూలై రెండో తేదీ నుంచి నెలాఖరు వరకు ఇంటింటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు చెప్పారు.
టీడీపీ కేడర్‌కు జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు పిలుపు
జిల్లాలో 5,19,709 నివాసాలు.. ఇంతవరకు 2,00,479 నివాసాలు మాత్రమే సందర్శన
ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశం
అనకాపల్లి రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. అనకాపల్లిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, అమలు పరిచిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు జూలై రెండో తేదీ నుంచి నెలాఖరు వరకు ఇంటింటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు చెప్పారు. జిల్లాలో మొత్తం ఐదు లక్షల 19 వేల 709 నివాసాలు వుండగా, ఇప్పటి వరకు రెండు లక్షల 479 నివాసాలను మాత్రమే సందర్శించామని తెలిపారు. మిగిలిన మూడు లక్షల 19 వేల 230 ఇళ్లను ఈ నెలాఖరులోగా సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, పోలింగ్ బూత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.