Share News

పోరు ఉధృతం

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:18 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులు గత 17 రోజులుగా సమ్మెలో ఉన్నాయి. ఇప్పటివరకు యాజమాన్యాలతో ప్రభుత్వం పూర్తిస్థాయి చర్చలు జరపలేదు. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సమ్మె ను ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సోమవారం విజయవాడలో అసోసియేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

పోరు ఉధృతం

నేడు విజయవాడలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సమావేశం

సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

ఇప్పటికే 17 రోజులుగా నిలిచిపోయిన వైద్య సేవలు

విరమించే యోచనలో పలు ఆస్పత్రుల యాజమాన్యాలు

విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులు గత 17 రోజులుగా సమ్మెలో ఉన్నాయి. ఇప్పటివరకు యాజమాన్యాలతో ప్రభుత్వం పూర్తిస్థాయి చర్చలు జరపలేదు. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సమ్మె ను ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సోమవారం విజయవాడలో అసోసియేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆరోగ్యశ్రీలో భాగంగా ఆస్పత్రులు ఇప్పటివరకు కొత్త రిజిస్ర్టేషన్స్‌ను నిర్వహిం చడం లేదు. ఇప్పటికే చికిత్స పొందుతున్న కేన్సర్‌, కిడ్నీ రోగులకు సేవలంది స్తున్నారు. వీటిని కూడా నిలిపివేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

సీఎం హామీ కోసం

ఇదిలా ఉండగా వీలైనంత త్వరగా ఆస్పత్రులు సమ్మె విరమించేలా ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అసోసియేషన్‌ ప్రతి నిధులతో సంప్రదింపులు జరిపారు. విదేశాల్లో ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన వెంటనే బకాయిలు విడు దల చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సీఎం నుంచి హామీ తీసుకున్న తరువాత సమ్మె విరమించే యోచనలో ఆస్పత్రుల యాజమాన్యాలు ఉన్నట్టు చెబుతున్నారు.

విరమణ యోచనలో కొన్ని..

జిల్లాలో 65 ప్రైవేటు/ కార్పొరేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో 32 ఆస్పత్రులు సమ్మెలో ఉన్నాయి. మరికొన్నింటిలో సాధారణ, అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు. కాగా సమ్మెలో ఉన్న కీలక ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలు అందించేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు ఆస్పత్రులు రెండు రోజులుగా కొత్తరోగులను చేర్చుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో మూడు ఆస్పత్రులు సోమవారం నుంచి సేవలు ప్రారంభిస్తాయంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 26 ఆస్పత్రులు మాత్రమే పూర్తిగా సమ్మెలో ఉన్నాయన్నారు.

ఇదే అదనుగా దోపిడీ..

సమ్మెలో ఉన్నప్పటికీ కేన్సర్‌, కిడ్నీ బాధితులకు వైద్య సేవలను కొనసాగించాలి. అయితే జిల్లాలోని కొన్ని ఆస్పత్రులు డయాలసిస్‌కు వస్తున్న రోగుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో ఉచిత సేవలు అందించలేమని, డయాలసిస్‌కు రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల కేన్సర్‌ రోగులకు కీమో, ఇతర థెరఫీలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 01:18 AM